కూటమిదే గెలుపు | Sakshi
Sakshi News home page

కూటమిదే గెలుపు

Published Sun, Nov 18 2018 10:29 AM

సభకు హాజరైన కార్యకర్తలు   - Sakshi

సాక్షి వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలకు కలిపి సుమారు 1.05 లక్షల ఓటు బ్యాంకు ఉందని అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల పైచిలుకు మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్‌ పార్టీ వనపర్తి నియోజకవర్గ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. రావుల వనపర్తి సీటు కావాలని అడిగితే ఇవ్వడానికి తాను సిద్ధంగానే ఉన్నానని, సిట్టింగ్‌ స్థానం కావడంతోనే కాంగ్రెస్‌కు కేటాయించారని వివరించారు. శనివారం  నామినేషన్‌ వేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి తన బాల్యమిత్రుడని, తరువాత వేర్వేరు పార్టీల్లో కొనసాగినా ఏనాడూ విద్వేషాలు రగిలించలేదని, వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు.

మీరిద్దరు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తే ఓటమి ఎరుగని నేతలుగా కొనసాగుతారని అధికారులు, ప్రజాప్రతినిధులు అంటుంటారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ 9నెలల ముందుగా ఎన్నికలకు వె ళ్లడం ద్వారా ప్రజలపై రూ.4వేలకోట్ల అదనపు భారం పడిందని తెలిపారు. కేసీఆర్‌ దయతో నా మినేటెడ్‌ పోస్టు తెచ్చుకున్న నాయకుడు నాలుగేళ్ల పాటు నిరంకుశపాలన కొనసాగించారని, ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, వనపర్తి ప్రజలమీద ఉన్న గౌరవంతో ఓర్చుకున్నామని వెల్లడించారు. డాక్టర్‌ బాలకిష్టయ్య, అయ్యప్ప, రావులతో పాటు తాను ప్రజల్లో ఒకరిగా కలిసిపోయామని, కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని చెప్పారు.

అన్ని సీట్లూ మావే: నాగం  
కాంగ్రెస్, టీడీపీతో పొత్తేమిటని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు విమర్శిస్తున్నారని, 2009 ఎన్నికల్లో టీ డీపీతోనే మహబూబ్‌నగర్‌ ఎంపీగా కేసీఆర్‌ గెలిచారని మాజీ మంత్రి నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నాగం జనార్ధన్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగా ణ బిల్లు పార్లమెంట్‌లో పాసైనప్పుడు 272 మంది ఎంపీలు ఓటు వేశారని కేసీఆర్‌ ఆ సమయంలో పార్లమెంట్‌లో లేరని, ఓటు వేయకుండా తప్పించుకున్నారని విమర్శించారు. 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం, సోనియాగాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 2014 ఎన్ని కల సమయంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, మిషన్‌ భగీరథ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో అధికారంలోకి వ చ్చిన కేసీఆర్‌ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలోనూ కూటమి అ భ్యర్థులే గెలుస్తారని నాగం ధీమా వ్యక్తంచేశారు.
 
నియోజకవర్గ బాగుకోసమే ఇద్దరం కలిశాం: రావుల 
వనపర్తి నియోజవర్గం అభివృద్ధి కోసమే చిన్నారెడ్డి, తాను ఇద్దరం కలిశామని, రాష్ట్రంలోనూ ప్ర జాస్వామ్యానికి ముప్పు పొంచి ఉండటంతోనే కాం గ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో కలిసి తె లంగాణ ప్రజాకూటమిగా ఏర్పడ్డామని టీడీపీ పొ లిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. తామిద్దరం పదో తరగతి వరకు ఇక్కడే చదువుకుని పాలిటెక్నిక్‌ కళా శాల మైదానంలో ఆటలాడుకునే వాళ్లమని, త ర్వాత ఇద్దరం చెరో రాజకీయపార్టీలో చేరి సి ద్ధాం తపరంగా విభేదించుకున్నామే తప్ప ఏనాడూ వ్య క్తిగత విమర్శలు, గొడవలకు దిగలేదని గుర్తుచేశా రు.

వనపర్తి అభివృద్ధికి ఎంతో కృషిచేశామని చె ప్పారు. ఇటీవల ఈ ప్రాంతానికి ఉన్న మంచిపేరు చెడిపోయే ప్రమాదం ఉండటంతో ఇద్దరం కలిసి మీ ముందుకు వస్తున్నామని ప్రజలకు వివరించా రు. చిన్నారెడ్డితో కలిసి ప్రతి మండలానికి ప్రచారానికి వస్తానని, గెలుపునకు కృషియాలని కోరారు. సెప్టెంబర్‌ 6న ప్రభుత్వాన్ని రద్దుచేసిన సమయం లో సీఎం కేసీఆర్‌ 100 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రాబోతున్నామని అనడం చూస్తే ఆయ నకు ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతుందన్నారు.కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement